విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్‌రెడ్డి' చిత్రం తెలుగులో ఏ స్థాయిలో సంచలనం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద సృష్టించింది. ఇప్పుడీ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఒరిజినల్ని తెరకెక్కించిన సందీప్‌రెడ్డి వంగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. షాహిద్‌కపూర్, తారా సుతారియా లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా హిందీ 'అర్జున్‌రెడ్డి' కోసం ఓ స్పెషల్ సాంగ్‌ని ప్లాన్ చేస్తున్నారట. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నటించిన 'ప్రేమికుడు' చిత్రంలోని 'ఊర్వశి.. ఊర్వశీ..' సాంగ్‌ని ఈ సినిమాలో రీమిక్స్ చేయబోతున్నారట. ఈ రీమిక్స్ సాంగ్ కోసం 'భరత్' బ్యూటీ కైరా అద్వానీని సంప్రదించారట. ఆమె ఓకే చేయడంతో ఈ సాంగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారనీ బాలీవుడ్ వర్గాల సమాచారమ్.
త్వరలో ఈ సాంగ్ చిత్రీకరణ ఫిల్మ్ సిటీలోని క్లబ్ సెట్లో నిర్వహించనున్నామని కొరియోగ్రాఫర్ సంజయ్ శెట్టి తెలిపారు. అప్పట్లో ఈ సాంగ్ కుర్రకారును ఉర్రూతలూగించింది. ఆ ఫ్లేవర్ ఏమాత్రం చెడిపోకుండా ఈ సాంగ్‌లో అక్కడక్కడా కొన్ని మార్పులు చేసి రీమిక్స్ చేయనున్నారట. ప్రభుదేవాకి తాను వీరాభిమానినని, ఆయన పాపులర్ సాంగ్‌లో తాను నటించడం చాలా ఆనందంగా ఉందని కైరా చెబుతోంది.
కైరా అద్వానీ ప్రస్తుతం తెలుగులో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లోనూ ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది.