అక్కినేని నాగార్జున హీరోగా అప్పుడెప్పుడో 'మజ్ను' అనే సినిమా వచ్చింది. ఇప్పుడు అక్కినేని అఖిల్ హీరోగా 'జున్ను' పేరుతో సినిమా రానుందట. వినడానికి డిఫరెంట్‌గా అనిపిస్తోందిది. అసలు ఇదేం టైటిల్ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి మరోపక్క. అయితే దర్శకుడు విక్రమ్ కుమార్ అన్నీ ఆలోచించే ఈ సినిమాకి ఈ టైటిల్ ఫిక్స్ చేయాలనుకుంటున్నాడని సమాచారమ్. ఇందులో హీరో పాత్ర పేరు జున్ను అట. కమెడియన్‌కి పెట్టాల్సిన టైటిల్, పాత్ర అఖిల్‌తో చేయించడమేంటట? బ్రహ్మానందం కోసం సెపరేట్ కామెడీ ట్రాక్ తెరకెక్కించడానికి ఇలాంటి స్వీట్లు, ఫ్రూట్లు పేర్లు ఇంతవరకూ విన్నాం. కానీ విక్రమ్ కుమార్ ఏకంగా హీరోకే ఈ తరహా టైటిల్ పెట్టేశాడు. అయినా విక్రమ్ కుమార్ ఏం చేసినా కొత్తగా ఉంటుంది. అతన్ని అంత తక్కువగా అంచనా వేయలేం. ఈ పేరు హీరోకి పెట్టడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. టైటిల్‌ని బట్టి అర్ధమవుతోంది. సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోందో అని. అఖిల్ తొలి సినిమా 'అఖిల్' సోషియో ఫాంటసీ నేపధ్యంలో తెరకెక్కింది. ఈ సారి రాబోయే చిత్రం ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలని నాగార్జున ముందు నుంచే అంటున్నాడు. ఆ కోణంలోంచే ఈ సినిమాకి ఈ టైటిల్‌ని అనుకుంటున్నారు కాబోలు. ఏది ఏమైనా ఈ టైటిల్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది కానీ టైటిల్‌పై ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.