బేబీ కోసం వస్తున్న కింగ్‌ నాగ్‌.?

By iQlikMovies - January 24, 2019 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

పెళ్లి తర్వాత 'రంగస్థలం','యూ టర్న్‌' తదితర ప్రయోగాత్మక చిత్రాల్లో నటించింది సమంత. ఆ తర్వాత కూడా కమర్షియల్‌ మూవీస్‌ కన్నా, డిఫరెంట్‌ మూవీస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఆ క్రమంలోనే రియల్‌ లైఫ్‌ భర్త అయిన చైతూతో రీల్‌ లైఫ్‌ లవ్‌ స్టోరీకి సై అంది. అదే 'మజిలీ' సినిమా. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే, నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ కొరియన్‌ మూవీ రీమేక్‌లో సమంత నటిస్తోంది. 

 

ఈ సినిమాలో కోడలు కోసం అక్కినేని నాగార్జున ఓ స్పెషల్‌ రోల్‌లో జాయిన్‌ కాబోతున్నాడట. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అక్కినేని నాగార్జునను ఒప్పించారట చిత్ర యూనిట్‌. నాగార్జున కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆల్రెడీ నాగార్జున గెటప్‌ కోసం ట్రైల్‌ షూట్స్‌ కూడా స్టార్ట్‌ అయ్యాయట. నాగార్జున గెటప్‌ చాలా కొత్తగా ఉండబోతోందనీ తెలుస్తోంది. ఈ సినిమాకి 'బేబీ' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.

 

'ఎంత సక్కగున్నావే' అనే క్యాప్షన్‌ అనుకుంటున్నారు. అయితే టైటిల్‌ విషయంలో ఇంకా క్లారిటీకి రాలేదు. కానీ కథ పరంగా ఈ టైటిల్‌నే ఖరారు చేసే యోచనలో చిత్ర యూనిట్‌ ఉందట. కాగా 60 ఏళ్ల భామ 16 ఏళ్ల తన మనవరాలి వయసులోకి ఎలా మారిపోయింది.? అనే ఆశక్తికరమైన కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాన్సెప్ట్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అయితే ఎలా వర్కవుటవుతుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS