'రంగస్థలం'లో 'రామలక్ష్మి'గా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న సమంత ఆ తర్వాతి నుండీ ప్రయోగాత్మక చిత్రాలకు సై అంటోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌కి సై అన్నదంటూ ఈ మధ్య జోరుగా వార్తలు వినిపించాయి. అది 60 ఏళ్ల బామ్మ పాత్రనీ, కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్‌గా తెరకెక్కుతోందనీ తెలిసింది.
అయితే తాజాగా ఈ సినిమాలో ఆ ఏజ్డ్ రోల్లో సమంత నటించడం లేదంటూ గాసిప్ ఒకటి బయటికి వచ్చింది. అయితే బామ్మ పాత్రలో సమంత నటిస్తోందనే వార్త కూడా అఫీషియల్‌గా డిక్లర్ కాలేదు. ఓ గాసిప్‌గానే చర్చల్లో నిలిచింది. అయితే ఒరిజినల్ ప్రకారం ఏజ్డ్ బామ్మ పాత్రతో పాటు, టీనేజ్ అమ్మాయి పాత్ర అనే ఈ రెండు వేరియేషన్స్‌లోనూ సమంత మెప్పించనునందనీ ప్రచారం జరిగింది. తాజాగా సర్క్యులేట్ అవుతోన్న ఈ సమాచారమ్ ప్రకారం ఆ ఏజ్డ్ పాత్రను సమంత హోల్డ్‌లో పెట్టిందనీ తెలుస్తోంది.
అయితే ప్రయోగాలకు సమంత అస్సలు భయపడడం లేదిప్పుడు. ఆ మాటకొస్తే, అవకాశమంటూ వస్తే ఏ హీరోయిన్ కూడా వెనుకాడడం లేదు. అలాంటిది ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు సమంత ఎందుకు వదులుకుంటుంది.? చూడాలి మరి. ఇది జస్ట్ గాసిప్ న్యూసేనా.? లేక నిజమేనా.? అనేది. మరోవైపు భర్త చైతూతో సమంత 'మజిలీ' అనే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది.