వరుసగా రెండు ఫ్లాపుల తరవాత మూడో చిత్రాన్ని వదులుతున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. అయినా సరే... ఈ సినిమాకి మంచి బిజినెస్సే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మిస్టర్ మజ్ను సినిమా దాదాపు 23 కోట్లకు అమ్ముడైంది. అయితే అందులో అడ్వాన్సుల రూపంలో హక్కుల్ని అమ్మినదే ఎక్కువ.
నైజాంలో రూ.6 కోట్ల బిజినెస్ జరిగింది. సీడెడ్లో రూ.2.7 కోట్లకు కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా హక్కులు రూ.1.5 కోట్లకు, గుంటూరు హక్కులు మరో కోటిన్నరకరు అమ్ముడయ్యాయి. కృష్ణా, పశ్చిమ కలసి దాదాపు రూ.2.75 కోట్ల వరకూ వచ్చింది. ఓవర్సీస్ ఏకంగా రూ.3.7 కోట్లకు అమ్ముడైంది. మొత్తంగా చూస్తే ఇవన్నీ మంచి రేట్లే అనుకోవాలి.
తొలి ప్రేమతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి పై బయ్యర్లకు బాగా నమ్మకం. పైగా పాటలు, ప్రచార చిత్రాలూ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఎఫ్ 2 తప్ప, బాక్సాఫీసు దగ్గర మరో సినిమా లేదు. అఖిల్ సినిమాలో ఏమాత్రం సరుకున్నా.. ఈ మొత్తం రాబట్టుకోవడం చాలా సులభం. మరి మజ్ను ఏం చేస్తాడో చూడాలి.