లైకుల్లో ఆ సినిమా ట్రైలర్ వరల్డ్ రికార్డ్!

మరిన్ని వార్తలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ నటించిన చివరి చిత్రం 'దిల్ బేచారా' త్వరలోనే డిస్నీ+హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కానుందన్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆకస్మిక మరణం తర్వాత విడుదలవుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాకోసం అతని అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

ఇదిలా ఉంటే ఈ నెల 6 వ తేదీన విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీ వ్యూస్ తో, లైక్స్ తో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ ఈ ట్రైలర్ కు 71 మిలియన్ వ్యూస్, 10 మిలియన్ల లైక్స్ సాధించింది. దీంతో అతి తక్కువ సమయంలో 10 మిలియన్ల లైక్స్ సాధించిన చిత్రంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. సుశాంత్ మరణం ఎక్కువ మంది ప్రేక్షకులను మనసులను కదిలించడమే దీనికి కారణమని, వ్యూస్, లైక్స్ తో ప్రేక్షకులు సుశాంత్ పై తమ ప్రేమను తెలుపుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

ఈ లెక్కన చూస్తే 'దిల్ బేచారా' కు సినిమా రిలీజ్ సమయంలో భారీ వ్యూయర్ షిప్ దక్కడం ఖాయమని అంటున్నారు. డిస్నీ+హాట్ స్టార్ వారు సబ్ స్క్రిప్షన్ అవసరం లేకుండా ఈ సినిమాను అందరూ చూడవచ్చని ప్రేక్షకులకు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS