ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ తమన్నా సింహాద్రిని హౌస్‌లోకి పంపించి బిగ్‌బాస్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తమన్నా దెబ్బకి అంతవరకూ బిగ్‌బాస్ సీజన్ 3ని ఎంతో ప్రేమగా చూస్తున్న వీక్షకులు విసిగెత్తిపోయారు. బిగ్‌బాస్‌కి ఇదేం కర్మరా.! బాబూ అని చాలాసార్లు అనుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు తమన్నాని బయటికి పంపిన బిగ్‌బాస్ ఇప్పుడు 7 వ వారంలో ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తిని తీసుకొచ్చారు.
ఈమె వస్తూ వస్తూనే కాంట్రవర్సీలు క్రియేట్ చేసింది. శ్రీముఖితో పెట్టుకోవాలని చూసింది. తరువాతి రోజు బాబా భాస్కర్‌ని ఉత్త పుణ్యానికే గొడవలోకి లాగింది. బాబా భాస్కర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంగతి హౌస్‌లో ఉన్నవారికీ, హౌస్‌ని బయటి నుండి చూస్తున్న వారికీ బాగా తెలిసిందే. అలాంటిది వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ముందుగానే తనకు ఇన్‌ఫర్మేషన్ ఉన్న శిల్పా చక్రవర్తి, ఇన్ని రోజులుగా బయటి నుండి హౌస్‌ని డీప్‌గా అబ్జర్వ్ చేస్తూనే ఉండి ఉండొచ్చు. అలాంటిది, బాబా భాస్కర్ సిల్లీగా అన్న మాటని పట్టుకుని, చాలా సేపు సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్ పెట్టుకుని గొడవ పడుతోందన్నట్లు డిస్ట్రబెన్స్ మూడ్ క్రియేట్ చేసింది.
పదే పదే బాబా భాస్కర్‌ని కెలికి మరీ, గొడవలోకి లాగే ప్రయత్నం చేసింది. ఇంతకు ముందు తమన్నా కూడా ఇదే చేసింది. కెలికి కెలికి మరీ గొడవలు పెట్టుకునేది. శిల్పాని కూడా అందుకే హౌస్‌లోకి పంపించారా.? 'నువ్వు ఒక వారం రోజుల్లోనే బయటికి వెళతావ్..' అని బాబా భాస్కర్, శిల్పా చక్రవర్తితో జోక్ చేయడం తప్పా.? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే, అంత వైలెంట్‌గా బిహేవ్ చేయాలా.? ఎంట్రీ ఇచ్చిన డే వన్‌లోనే ఇలా ఉంటే, ఈ వైల్డ్ కంటెస్టెంట్ ఇకపై హౌస్‌లో సృష్టించే వైలెన్స్ ఎలా ఉండబోతోందో చూడాలిక.