ప్రముఖ మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమా మాధవన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నంబి నారాయణ్ పాత్ర కోసం మాధవన్ తనను తాను మేకోవర్ చేసుకున్న తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. అచ్చు శాస్త్రవేత్త నంబి నారాయణన్ గెటప్‌లోకి మారిపోయారాయన. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు, దర్శకత్వ బాధ్యత కూడా తీసుకుంటున్నారు మాధవన్.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మరో రెండు కీలక పాత్రల కోసం ఇద్దరు నటుల్ని ఎంచుకోవాలనుకుంటున్నారట. అయితే ఆ ఇద్దరు నటులు తమిళ, హిందీ భాషల్లో స్టార్‌డమ్ ఉన్న వాళ్లయితే సినిమాకి వెయిట్ పెరుగుతుందని యోచిస్తున్నారట. ఆ క్రమంలో బాలీవుడ్ నుండి షారూఖ్‌ఖాన్‌నీ, కోలీవుడ్ నుండీ సూర్యనీ సంప్రదించారట. మాధవన్‌కి తమిళ, హిందీ భాషల్లో మంచి పేరుంది. మాధవన్ అడగ్గానే ఆయా గెస్ట్ రోల్స్ పోషించేందుకు ఆ ఇద్దరు నటులు ఓకే అన్నారనీ సమాచారమ్.
అంటే బయోపిక్స్‌తో పాటు, మల్టీ స్టారర్స్ ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో ఇదో మల్టీ స్టారర్ కానుందన్న మాట. అలాగే మాధవన్ మరోవైపు 'సైలెన్స్' అనే బైలింగ్వల్ మూవీలోనూ నటిస్తున్నాడు. అనుష్క ఈ సినిమాలో హీరోయిన్. ఇదిలా ఉంటే, తెలుగులో ఇటీవల మాధవన్ 'సవ్యసాచి' చిత్రంలో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.