ఆలియా భట్ కి యాక్సిడెంట్

By iQlikMovies - March 20, 2018 - 13:07 PM IST

మరిన్ని వార్తలు

బ్రేకింగ్ న్యూస్: నటి ఆలియా బట్ కి షూటింగ్ స్పాట్ లో యాక్సిడెంట్ కి గురైంది.

అందుతున్న సమాచారం ప్రకారం, ఆలియా బట్ ప్రస్తుతం రన్బీర్ కపూర్ తో కలిసి బ్రహ్మాస్త్ర చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నది. ఇక ఈ చిత్రంలో చాలా పోరాట సన్నివేశాలు ఉండడం దానితో నటీనటులు కూడా వాటిని చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఒక స్టంట్ చేయడానికి ఆలియా ప్రయత్నించగా ఆమె గాయపడిందట.

వెంటనే ఆమెకి ప్రాధమిక చికిత్స అందించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా ఆమె భుజానికి గాయం అయినట్టు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలిసింది. దీనితో షూటింగ్ కి కొద్దిగా అంతరాయం ఏర్పడింది. 

ఈ చిత్రంలో రన్బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఆలియా బట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS