ఎన్టీఆర్ రీమేక్ లో హీరో కూతురు

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ తన కెరీర్ లో ఒడిదుడుకులు ఎదురుకుంటున్న సమయంలో ఆయనకి టెంపర్ చిత్రం రూపంలో ఒక పెద్ద హిట్ వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం హిందీ లో ‘సింబా’గా రీమేక్ కానుంది.

ఈ రీమేక్ లో హిందీ స్టార్ హీరో రన్వీర్ సింగ్ నటిస్తుండగా ఈ చిత్రాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఒక ప్రముఖ హీరో కూతురిని ఎంపిక చేశారు. ఇంతకి ఆ హీరో ఎవరంటే- సైఫ్ అలీ ఖాన్. సైఫ్-అమ్రితా సింగ్ ల కూతురు సారా అలీ ఖాన్ ని ఈ రీమేక్ లో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు.

దీనికి సంబంధించి ఈ చిత్ర నిర్మాత కరణ జోహార్ ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీనితో ఈ చిత్రం షూటింగ్ కి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలిగిపోయాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఇక సింబా చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS