కంగనాకి ఎందుకింత కక్కుర్తి.!

By Inkmantra - April 23, 2019 - 11:50 AM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ క్వీన్‌గా, మంచి నటిగా బాలీవుడ్‌లో కంగనా రనౌత్కి బోలెడంత ఫేమ్‌ ఉంది. స్టార్‌ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ ఉంది. అయితే ఈ మధ్య కంగనా తీరు విమర్శల పాలవుతోంది. చిన్న చిన్న విషయాల్ని పట్టుకుని పెద్ద రచ్చ చేస్తోంది. పబ్లిసిటీ అంటే కంగనాకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అన్నిసార్లూ పబ్లిసిటీ స్టంట్స్‌ పనికి రావు. మొన్నా మధ్య డైరెక్టర్‌ క్రిష్‌ విషయంలో పబ్లిసిటీకి పోయి బాగానే పండగ చేసుకుంది. కానీ కంగనా పప్పులిప్పుడుడకట్లేదు. 

 

పబ్లిసిటీ పేరు చెప్పి, అనవసరంగా అలియాభట్‌ని కెలుకుతూ అవమానాల పాలవుతోంది. విమర్శలు ఎదుర్కొంటోంది. అనవసరంగా అలియా విషయాన్ని ఇష్యూ చేస్తోంది కంగనా. అలియాపై దుర్భాషలు ఆడుతూ మీడియాకెక్కుతోంది. అంతటితో ఆగకుండా, ఇప్పుడు అలియా తల్లిని కూడా కెలికింది. ఎట్టకేలకు అలియా ఈ విషయంలో స్పందించింది. తనపై అనవసరంగా నోరు పారేసుకుంటున్న కంగనాని ఏమీ అనలేదు. కానీ నటిగా నా కన్నా, నా ఫ్యామిలీ ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది.. పరిణతితో ఆలోచిస్తుంది. 

 

అదే దారిలో నేనూ నడవాలనుకుంటున్నాను. రోజు రోజుకూ నన్ను నేను పరిణీతి చెందించుకోవడానికి కష్టపడతాను కానీ, ఆ దారిలో ఇలాంటి అనవసర మాటలు, విమర్శలూ పట్టించుకోను. ఇవి చాలా చిన్న విషయాలు, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకుంటే, కెరీర్‌లో ఎంతో సాధించాలనుకుంటున్న నా లక్ష్యాన్ని నేను అందుకోలేను. సో కామ్‌గా ఉంటానంతే.. అని చెప్పింది. వయసులో చిన్నదైనా అలియా ఎంతో హుందాగా వ్యవహరించింది. అలియాభట్‌ స్పందనకు ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS