అయ్యో తగ్గించేయడమంటే ఇంకేదో డబుల్ మీనింగ్ తీసుకోకండి సుమీ. వెంటనే వివరాల్లోకి వెళ్లిపోదాం. శృతిహాసన్ రెమ్యునరేషన్ బాగా తగ్గించేసిందట. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ వెలుగు వెలిగిన శృతిహాసన్‌కి ఇప్పుడంత సీను లేకుండా పోయింది. ఏ భాషలోనూ శృతి చేతిలో సినిమాలు లేవు. తమిళంలో 'శభాష్ నాయుడు' సినిమా ఉన్నా, దాని స్టేటస్ ఏంటో ఎవరికీ తెలియని పరిస్థితి.
ఇదిలా ఉంటే, తాజాగా శృతిహాసన్ తమిళంలో ఓ సినిమాకి కమిట్ అయ్యిందట. ఆ సినిమా లేటెస్ట్‌గా సెట్స్ మీదికెళ్లింది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడుతో దూసుకెళుతోంది. ఆయన ఏది పట్టినా బంగారమే అవుతోంది. సో విజయ్‌సేతుపతి నుండి వస్తున్న సినిమా అంటే ఆటోమెటిగ్గా అందరిలోనూ ఆశక్తి నెలకొంటుంది.
రీ ఎంట్రీలో వస్తున్న శృతిహాసన్‌కి విజయ్‌సేతుపతి వంటి స్టార్‌తో ఛాన్స్ దక్కడం అదృష్టమే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి 'లాభం' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ అంబసముద్రంలో జరగనుంది. జగపతిబాబు మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి రైతు పాత్రలోనూ, శృతిహాసన్ సింగర్ కమ్ డాన్సర్ పాత్రలో కనిపించనుంది.