తెలుగులో 'అనగనగా ఒక ధీరుడు', 'సైజ్ జీరో' వంటి విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు తనయుడే ఈ ప్రకాష్ కోవెలమూడి. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటాడు. కంటెన్ట్‌లో సరికొత్త వేరియేషన్ చూపించడానికి ట్రై చేస్తుంటాడీ యంగ్ డైరెక్టర్. ఇప్పుడు బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌తో 'మెంటల్ హై క్యా' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ మెంటల్లీ డిజార్డర్ పీపుల్ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటూ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్‌కి ఫిర్యాదు చేశారు.
టైటిల్‌తో పాటు, సినిమాలో కంటెన్ట్ కూడా ఇబ్బందికరంగా ఉండేలా ఉంటే, సినిమాని అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. సినిమాలో మెంటల్ డిజార్డర్ ఉన్న వారిని కించపరిచే సన్నివేశాలేమైనా ఉంటే, వాటిని తొలగించాలనీ సెన్సార్ బోర్డు వారిని కోరారు. అయితే ఈ అభ్యంతరాలపై ఇంతవరకూ 'మెంటల్ హై క్యా' టీమ్ స్పందించలేదు. సరికదా, తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ మరో వివాదానికి కేంద్రబిందువైంది. హీరో, హీరోయిన్ తమ నాలుకపై ఒకే బ్లేడును బ్యాలెన్స్ చేసిన విధానం పిచ్చిగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
లుక్‌లో కంగనా ఉంగరాలు తిరిగిన, షార్ట్ హెయిర్ స్టైల్‌తో డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఆమె మెడపై ఉన్న పెద్ద పుట్టు మచ్చ ఈ లుక్‌కి మరింత డిఫరెంట్ అప్పీల్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో అందాల భామ అమైరా దస్తూర్ ఇంకో కీలక పాత్రలో కనిపించనుంది. మొత్తానికి మొన్నటి 'మణికర్ణిక'తో సరిపెట్టకుండా, ఇప్పుడు 'మెంటల్ హై క్యా'తో మరోసారి కంగనా సంచలనం సృష్టించేలానే ఉంది. జూన్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.