హిట్టు కోసం న‌రేష్ పాట్లు

By Gowthami - March 16, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

అల్ల‌రోడు హిట్టు కొట్టి యేళ్ల‌కు ఏళ్లు అయిపోయింది. వ‌రుస ఫ్లాపుల‌తో న‌రేష్ మార్కెట్ పూర్తిగా అస్త‌వ్య‌స్థ‌మైపోయింది. ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాలో ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు న‌రేష్‌. ఈ సినిమా హిట్టై, త‌న‌కు మంచి పేరొస్తే - ఈ త‌ర‌హా పాత్ర‌ల‌తో సెటిల్ అయిపోవొచ్చు. అయితే... క‌థానాయ‌కుడిగా త‌న వంతు ప్ర‌య‌త్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. ప్ర‌స్తుతం గిరి ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి `బంగారు బుల్లోడు` అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. 

 

షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. అయితే... ర‌షెష్ చూసుకున్న న‌రేష్ - అవుట్ పుట్‌పై ఏమాత్రం సంతృప్తి లేన‌ట్టు తెలుస్తోంది. ఇందులో కొన్ని స‌న్నివేశాల్ని మ‌ళ్లీ కొత్తగా రాసుకుని, రీషూట్ చేయాల‌ని భావిస్తున్నారట. ఏప్రిల్ 10 నుంచి కొత్త షెడ్యూల్ మొద‌ల‌వ్వ‌బోతోంద‌ని, ఈసారి రీషూట్ల‌కే ప‌ది రోజులు కేటాయించార‌ని తెలుస్తోంది. ఈ సినిమా న‌రేష్ కెరీర్‌కి అత్యంత కీల‌క‌మైన‌ది. అటూ ఇటూ అయితే.. ఇక న‌రేష్ హీరోగా క‌న‌ప‌డ‌క‌పోవొచ్చు. అందుకే ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. మే లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత అనిల్ సుంక‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS