బాల‌య్య పాట‌ని రీమిక్స్ చేస్తున్న అల్ల‌రోడు

By Gowthami - March 16, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

పాత పాట‌ల్ని రీమిక్స్ చేసి, త‌న సినిమాల్లో వాడుకోవ‌డం అల్ల‌రి న‌రేష్‌కి కొత్త కాదు. ఆకాశంలో ఒక‌తార‌, మంచ‌మేసి దుప్ప‌టేసి మ‌ల్లెపూలు చ‌ల్లాను, అత్తో అత్త‌మ్మ కూతురో - ఇలా సూప‌ర్ హిట్ గీతాల్నీ న‌రేష్ వాడుకున్నాడు. ఇప్పుడు న‌రేష్ క‌న్ను బాల‌కృష్ణ సూప‌ర్ హిట్ గీతంపై ప‌డింద‌ని టాక్‌. న‌రేష్ క‌థానాయ‌కుడిగా గిరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. అనిల్ సుంక‌ర నిర్మాత‌. ఈ సినిమా కోసం `బంగారు బుల్లోడు` సినిమాలోని `స్వాతిలో ముత్య‌మంత‌` అనే పాపుల‌ర్ గీతాన్ని రీమిక్స్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

 

అంతేకాదు..ఈ సినిమాకి `బంగారు బుల్లోడు` అనే టైటిల్ ఫిక్స్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఇందుకు సంబంధించి నిర్మాత నందమూరి బాల‌కృష్ణ ద‌గ్గ‌ర అనుమ‌తి కూడా తీసుకున్నాడ‌ని, రాజ్ - కోటిల‌కు భారీ మొత్తం న‌జ‌రానాగా ఇచ్చి.. `బంగారు బుల్లోడు` పాట‌ని రీమిక్స్ చేయ‌డానికి హ‌క్కుల్ని సంపాదించాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం `మ‌హ‌ర్షి` షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు న‌రేష్‌. వేస‌విలోనే న‌రేష్ - గిరిల సినిమా విడుద‌ల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS