సెంటిమెంట్‌తో గుండెల్ని పిండేస్తారట‌!

మరిన్ని వార్తలు

నాగ‌చైత‌న్య - స‌మంత‌... ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన సినిమాల‌న్నీ హిట్టే. అన్నింటిలోనూ రొమాంటిక్ జంట‌గా క‌నువిందు చేశారు. వీరిద్ద‌రి కెమిస్ట్రీ వ‌ల్లే.. ఆయా సినిమాలు బాగా ఆడాయి. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ `మ‌జిలీ` కోసం జ‌ట్టు క‌ట్టారు. ఏప్రిల్ లో ఈ సినిమా విడుద‌ల అవుతోంది. అయితే.. ఈసారి రొమాన్స్‌తో కాదు, సెంటిమెంట్‌తో గుండెల్ని పిండి చేసేస్తారట.

 

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `మ‌జిలీ`. ఇదో విఫ‌ల ప్రేమికుడి క‌థ‌. ప్రేమ‌లో విఫ‌ల‌మై, న‌చ్చిన అమ్మాయి దొర‌క్క‌.. దొరికిన అమ్మాయితో జీవితాన్ని పంచుకోలేక స‌త‌మ‌త‌మ‌య్యే ఓ యువ‌కుడి క‌థ‌. చైతూ - స‌మంత భార్యా భ‌ర్తలుగా న‌టించారు. పెళ్ల‌యినా ఇద్ద‌రి మ‌ధ్య దూరం అలానే ఉంటుంది. త‌న భ‌ర్త‌ని త‌న‌వాడిగా చేసుకునేందుకు స‌మంత ప్ర‌య‌త్నిస్తుంటే, మ‌న‌సులో ఉన్న మ‌రో అమ్మాయి బొమ్మ చెరుపుకోలేక చైతూ తాగుబోతుగా మార‌తాడు. 

 

ఇద్ద‌రి మ‌ధ్య ఎమోష‌న్ సీన్లు బాగా వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. వాళ్ల మ‌ధ్య పండే సెంటిమెంట్‌తో సెకండాఫ్ న‌డిచిపోతుంద‌ట‌. అయితే కామెడీ సీన్ల‌కు గానీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి గానీ ఎక్క‌డా చోటు లేద‌ని, ఫీల్ గుడ్ సీన్ల‌తోనే సినిమా మొత్తం సాగిపోతుంద‌ని తెలుస్తోంది. చైతూ- స‌మంత‌ల‌కు ఇది నిజంగా కొత్త త‌ర‌హా పాత్రే. మ‌రి నిజ జీవితంలో విజ‌య‌వంత‌మైన ఈ ప్రేమ జంట - తెర‌పై విఫ‌ల‌మైన జంట‌గా క‌నిపిస్తే జ‌నం చూడ‌గ‌ల‌రా? అనేదే పెద్ద డౌటు. ఈ అనుమానం నివృత్తి కావాంటే.. `మ‌జిలీ` రావాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS