అల్లరోడు అలా మారిపోయాడు..!

By Inkmantra - February 20, 2019 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

తన తొలి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో అల్లరి నరేష్‌. అల్లరి నరేష్‌ సినిమా అంటే మినిమయ్‌ గ్యారంటీ అనే టాక్‌ ఉండేది. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు బొత్తిగా అల్లరోన్ని పట్టించుకోవడం మానేశారు జనం. దాంతో అల్లరోడికి గిరాకీ పూర్తిగా లేకుండా పోయింది. ఏం చేసినా జనం మెచ్చట్లేదు మనోడ్ని. దాంతో ఇప్పటికైతే మహేష్‌బాబుతో పీకల్లోతు ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నాడు. అదేనండీ మహేష్‌బాబు నటిస్తున్న 'మహర్షి' సినిమాలో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ నటిస్తున్నాడు. 

 

ఈ సంగతిటుంచితే, తాజాగా అల్లరి నరేష్‌ ఇంకో సినిమాకి సైన్‌ చేశాడట. ఇదో సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అనీ సమాచారమ్‌. ఈ. సత్తిబాబు ఈ సినిమాకి దర్శకుడు. గతంలో ఈ. సత్తిబాబు, అల్లరి నరేష్‌ కాంబినేషన్‌లో మూడు సినిమాలొచ్చాయి. 'బెట్టింగ్‌ బంగార్రాజు', 'జంప్‌ జిలానీ', యముడికి మొగుడు' వంటి సినిమాలన్న మాట. ఆ సినిమాలతో పూర్తిగా నవ్వించేసిన ఈ సత్తిబాబు ఇప్పుడు చాలా సీరియస్‌గా అల్లరోడ్ని చూపించేందుకు రెడీ అయిపోతున్నాడట. 

 

డిఫరెంట్‌ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో అల్లరి నరేష్‌ని సంప్రదించగా కామెడీ బోర్‌ కొట్టి, బోర్‌ కొట్టి ఉన్న మనోడికి ఆ కాన్సెప్ట్‌ తెగ నచ్చేసిందట. వెంటనే ఓకే చేసేశాడట. అయినా అల్లరి నరేష్‌లో కామెడీ హీరో ఎంతగా దాగున్నాడో. అంతకు మించిన సీరియస్‌ నటుడు కూడా ఉన్నాడు. గతంలో 'విశాఖ ఎక్స్‌ప్రెస్‌' తదితర చిత్రాలు ఆ విషయాన్ని ప్రూవ్‌ చేసేశాయి. ఇప్పుడిక పూర్తిగా మారిపోయిన అల్లరి నరేష్‌ని చూడబోతున్నాం. కాస్కోండి మరి. మే లో ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుంది. లక్ష్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ని రూపొందించనుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS