అల్లు అర్జున్ కి బర్త్ డే సర్ప్రైజ్

By iQlikMovies - April 03, 2018 - 14:28 PM IST

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఈ నెల 8న రాబోతున్నది. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వనున్నారట. ఆ సర్ప్రైజ్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ఇవ్వనున్నాడట.

ఆ వివరాల్లోకి వెళితే- అల్లు అర్జున్ రూపంలోని సైకత శిల్పాని ఒకటి వైజాగ్ బీచ్ లో ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఆధ్వర్యంలో సుమారు 40 అడుగుల అల్లు అర్జున్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఇప్పటివరకు తెలుగు హీరోలకి ఎవ్వరికీ కూడా ఈ ఘనత కూడా దక్కలేదు.

ఇక ఆయన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం షూటింగ్ చివరిదశకు చేరింది. దీనితో అల్లు అర్జున్ పుట్టినరోజు నుండి ఈ సినిమాకి ప్రమోషన్స్ మొదలవ్వనున్నాయి. అలాగే మిలిటరీ మాధవపురంలో ఈ సినిమాకి సంబంధించి ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు.

మొత్తానికి అల్లు అర్జున్ చాలా కొత్తగా తన చిత్రాన్ని ఈ సారి ప్రచారం చేయబోతున్నాడు.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS