మెగా మూవీకి 'మంచు' ప్రశంస

మరిన్ని వార్తలు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన తాజా చిత్రం 'రంగస్థలం' వసూళ్ల పరంగా దూసుకెళ్తూ, ప్రముఖుల ప్రశంసల జల్లుతో తడిసి ముద్దవుతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటులు మోహన్‌బాబు 'రంగస్థలం'పై ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. 

'ఈ సినిమా గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మంచి విషయాలు వింటున్నాను. త్వరలోనే నేను కూడా సినిమా చూస్తాను. చరణ్‌ బృందానికి కంగ్రాట్స్‌, పిల్లలు తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తే, ఏ తండ్రికైనా గర్వంగా ఉంటుంది. అలాగే నా స్నేహితుడు చిరంజీవి కూడా గర్వపడుతున్నారనీ ఆనుకుంటున్నాను. కంగ్రాట్స్‌..' అని ట్వీట్‌ చేశారు. 

ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అద్భుత కావ్యాల చెంతన చేర్చగల ఓ అద్భుత కావ్యం ఈ చిత్రం. అవార్డు చిత్రమా కాదా? అనే విషయం పక్కన పెడితే, ఇలాంటి చిత్రాల ముందు అవార్డులు కూడా చిన్న బోతాయనడంలో అతిశయోక్తి కాదు. అలాంటి చిత్రంగా ఈ 'రంగస్థలం' చరిత్రలో నిలిచిపోతుంది. 

చరణ్‌కే కాదు, ఈ సినిమాలో నటించిన ప్రతీ చిన్న పాత్రకీ కెరీర్‌ బెస్ట్‌ రోల్‌గా గుర్తింపు దక్కింది. ముఖ్యంగా రామ్‌చరణ్‌ పర్‌ఫామెన్స్‌కి, నట దిగ్గజాలు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి పాత్ర తమకెందుకు రాలేదా? అని యంగ్‌ హీరోలు కుళ్లుకుంటున్నారు. ఒకవేళ వచ్చినా, రామ్‌చరణ్‌లా నటించి, మెప్పించలేమేమో అని మళ్లీ ఆ క్రెడిట్‌ చరణ్‌కే ఇచ్చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS