అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'ధృవరాజా' సినిమా రేపే విడుదల కాబోతోంది. కొత్తగా ఈ 'ధృవరాజా' ఎప్పుడు తెరకెక్కిందనే కదా మీ డౌట్? అంత డౌట్ అక్కర్లేదు, ఇది అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'డిజె' సినిమానే. తెలుగులో 'దువ్వాడ జగన్నాథమ్' పేరుతో విడుదలైన 'డీజె' సినిమాని మలయాళంలో 'ధృవారాజా జగన్నాథ్'గా విడుదల చేస్తున్నారు. అక్కడా ఇక్కడా ఇంగ్లీషు టైటిల్ 'డిజె'లో ఎలాంటి మార్పూ లేదు. కానీ తెలుగులో 'దువ్వాడ జగన్నాధమ్'ని, మలయాళంలో 'ధృవరాజా'గా మార్చారు. టాలీవుడ్‌లో హీరోల్లో అత్యధిక మలయాళ మార్కెట్ ఉన్నది అల్లు అర్జున్‌కే. అక్కడి స్టార్ హీరోలకు ధీటుగా అల్లు అర్జున్ సత్తా చాటుతుంటాడు. అల్లు అర్జున్ సినిమాలకి అక్కడ మంచి ఆదరణ ఉంటుంది. 'ధృవరాజా' కూడా అలాగే మంచి విజయం సాధిస్తుందని అల్లు అర్జున్ మలయాళ అభిమానులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అల్లు అర్జున్‌కి మలయాళ అభిమానులు ఎక్కువే. తాజా సినిమా కోసం భారీ కటౌట్లు, బీభత్సమైన బ్యానర్లతో అక్కడ హడావిడి మొదలైంది. తమ అభిమాన హీరో సినిమాకి విపరీతమైన సందడి చేసేస్తున్నారక్కడ ఫ్యాన్స్. అల్లు అర్జున్, పూజా హెగ్దే జంటగా తెరకెక్కిన 'డిజె' సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.