థియేటర్ల మాఫియా గురించి ఈమధ్య 'పేట' నిర్మాత వల్లభనేని అశోక్ గళం ఎత్తిన సంగతి తెలిసిందే. నయీంని కాల్చినట్టే... థియేటర్ల మాఫియానీ కేసీఆర్ ప్రభుత్వం కాల్చి పాడేయాలని వివాదాస్పదన, సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. వీటిపై చిత్రసీమలోని పెద్దలు స్పందించడం మొదలెట్టారు. బన్నీ వాసు ఓ ట్వీట్ చేస్తూ... 'ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాద'న్నారు.
ఇప్పుడు దిల్‌రాజు కూడా తనదైన శైలిలో.. కౌంటర్ ఇచ్చారు. సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు విడుదల అవుతాయని ఆరు నెలల కిందటే ప్రకటించామని, అలాంటిది పదిహేను రోజుల ముందు ‘పేట’ సినిమాని కొనుక్కొని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు ఆ నిర్మాత ప్రకటిస్తే థియేటర్లు ఎలా సర్దుబాటు అవుతాయని దిల్‌రాజు ప్రశ్నిస్తున్నారు...?
మూడు తెలుగు సినిమాలు విడుదలవుతున్నప్పుడు అనువాద చిత్రానికి థియేటర్లు ఎలా దొరుకుతాయని, తెలుగు సినిమాలకి కాకుండా డబ్బింగ్ సినిమాలకు "ఈ సీజన్‌లో థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదని ఆయనక్లారిటీగా చెప్పేశారు. కొంతమంది అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, తనది ఆ తరహా క్యారెక్టర్ కాదని" గట్టిగా కౌంటర్ ఇచ్చాడు దిల్‌రాజు.