అక్కడా ఇక్కడా కైరా మేనేజ్‌ చేయగలదా.?

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ భామ కైరా అద్వానీ టాలీవుడ్‌లో 'భరత్‌' బ్యూటీగా పాపులర్‌ అయ్యింది. తొలి సినిమా 'భరత్‌ అనే నేను'తో హిట్‌ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వినయ విధేయ రామ'తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోతోంది. ఇదిలా ఉంటే, ఈ రెండు సినిమాలతోనూ కైరాకి టాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజ్‌ వచ్చేసింది. మూడో సినిమా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి కమిట్‌ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈలోగానే కైరా బాలీవుడ్‌లో రెండు సినిమాలకు సైన్‌ చేసింది. 

 

తెలుగుతో పాటు, తమిళ, మలయాళం ఇలా ఇతర భాషల్లో సినిమాలు చేయొచ్చు. కానీ బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ ఏకకాలంలో సినిమాలు చేయడం కూసింత కష్టమైన పనే. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని కైరా ఈ సాహసం చేస్తోంది. డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో వచ్చిన 'లస్ట్‌ స్టోరీస్‌' కైరాకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సో ఇదే టైమ్‌ అనుకుని అక్కడా, ఇక్కడా కూడా వచ్చిన అవకాశాల్ని వదులుకోకుండా అందిపుచ్చుకుంటోంది. అయితే బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేయాలంటేనే కష్టం. 

 

అలాంటిది రెండు సినిమాలకు కమిట్‌ అయిన కైరా మరి టాలీవుడ్‌కి దూరమవుతుందా.? అంటే కొన్ని రోజులు గ్యాప్‌ అయితే తప్పదని చెబుతోంది. మరి బన్నీ సినిమాలో కైరా అద్వానీ నటిస్తుందా.? లేదా.? కానీ బన్నీ - త్రివిక్రమ్‌ కాంబో ప్యాక్‌. ఇలాంటి అవకాశం అరుదే. సో వదులుకునే ఛాన్సే లేదు. ఇదిలా ఉంటే, కైరా డెడికేషన్‌ని మెచ్చుకోవాల్సిందే. సంక్రాంతికి విడుదల కానున్న 'వీవీఆర్‌' ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటోంది. మరోవైపు బాలీవుడ్‌ దర్శక, నిర్మాతలతోనూ టచ్‌లో ఉంటోంది. అందుకే కైరా కష్టానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS