ప్రయోగాలు చేసి చేసి బన్నీకి విరక్తి పుట్టినట్లుంది. ఈ సారి చేయబోయే సినిమా ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాడట. అస్సలేమాత్రం సీరియస్ టోన్ కనిపించదట ఈ సినిమాలో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'జులాయి', సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు మంచి విజయం అందుకున్నాయి.
ఇక మూడో సినిమాగా రాబోతున్న తాజా చిత్రంలో సీరియస్‌నెస్‌కి ఏమాత్రం చోటివ్వకుండా, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా, అంటే ఇంచుమించు 'జులాయి' సినిమాని తలపించేలా ప్లాన్ చేశారట. త్రివిక్రమ్ సినిమాలు అంటే పక్కా పైసా వసూల్ కామెడీతో, పంచ్ డైలాగులు, టైమింగ్స్‌తో ఆకట్టుకునేవి. అయితే ఈ మధ్య త్రివిక్రమ్ సినిమాల్లో అలాంటి కంటెన్ట్ పుష్కలంగా కనిపించడం లేదు.
కానీ ఈ సారి బన్నీతో చేయబోయే సినిమాకి పాత త్రివిక్రమ్‌ని చూడబోతున్నామనీ తెలుస్తోంది. ఆ ఫార్ములాతోనే బన్నీ కోసం స్క్రిప్టు ప్రిపేర్ చేశాడట త్రివిక్రమ్. ఈ నెలాఖరులో సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. ఇకపోతే ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్గా కైరా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారు. ఈ బ్యూటీ నటించిన 'వినయ విధేయ రామ' మూవీ సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే.