టాక్ అఫ్ ది వీక్ – అమర్ అక్బర్ అంటోనీ & టాక్సీవాలా

By iQlikMovies - November 18, 2018 - 12:37 PM IST

మరిన్ని వార్తలు

ఈవారం సినీ అభిమానులకి రెండు సినిమాలు విడుదలకావడంతో పోయిన వారం వచ్చిన గ్యాప్ కి కాస్తంత సమతుల్యం వచ్చినట్టుగానే భావించవచ్చు. ఇక ఈ వారం విడుదలైన చిత్రాలలో ఒకటి రవితేజ అమర్ అక్బర్ అంటోనీ కాగా మరొకటి విజయ్ దేవరకొండ టాక్సీవాలా.

 

ముందుగా రవితేజ అమర్ అక్బర్ అంటోనీ గురించి మాట్లాడుకుంటే, హిట్ కాంబోగా పేరుపొందిన రవితేజ-శ్రీను వైట్ల కలయికలో వచ్చిన మూడవ చిత్రం ఇది. ఈ తరుణంలో సినిమా పైన అంచనాలు భారీగా ఏర్పడ్డాయి, పైగా ఈసారి తనకి బాగా కలిసొచ్చిన కమెడియన్స్ ని ఈ సినిమాలో పెట్టడంతో అందరి దృష్టి దీని పైనే ఉండింది.

కాకపోతే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎంత ఉన్నప్పటికి కథలో బలం కూడా ఉండడం ఎంతో అవసరం. ఇదే ప్రధాన లోపం కావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడింది. సినిమా మొదటి షో నుండే ఈ సినిమా పైన నేగితివే రావడంతో మొదటిరోజే ఈ చిత్రం ఫ్లాప్ గా పేరు తెచ్చేసుకుంది.

ఇక రెండవ చిత్రం టాక్సీవాలా. ఈ సినిమా విడుదలకి రెండు నెలల ముందే లీక్ అవ్వడంతో టాక్సీవాలా యూనిట్ కి పెద్ద షాక్ తగిలింది. ఈ తరుణంలో విడుదలైన టాక్సీవాలా చిత్రం ప్రేక్షకుల మనసులని గెలుచుకోగలిగింది. చిత్రం ఆద్యంతం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తూ నడిపిన కథనం ఈ సినిమాకి కలిసొచ్చిన అంశం అని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ సినిమా టెక్నికల్ గా చాలా బాగుంది అని చెప్పొచ్చు. కొత్త దర్శకుడైనప్పటికి ఇలాంటి ఒక సైన్స్ ఫిక్షన్ కథని నడిపించిన తీరు అందరికి నచ్చేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు. దీనికి తోడు విజయ్ నటన ప్రధాన ఆకర్షణగా ఈ సినిమా ఆయన ఖాతాలో మరొక హిట్ చిత్రంగా నిలిచిపోయింది.

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS