స్టైలీష్ స్టార్ కాదు... ఐకాన్ స్టార్‌‌

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ అన‌గానే.. `స్టైలీష్ స్టార్` అనే బిరుదు చ‌టుక్కున గుర్తొస్తుంది. సినిమా సినిమాకీ తాను ప‌రిచ‌యం చేసే స్టైల్ అలా ఉంటుంది. ఈ బిరుదుకి బాగానే న్యాయం చేశాడు బ‌న్నీ. అయితే ఇప్పుడు బ‌న్నీ పిలుపు మారింది. తాను ఇక స్టైలీష్ స్టార్ కాదు. ఐకాన్ స్టార్‌. ఈ బిరుదు ఇచ్చింది మ‌రెవ‌రో కాదు.. బ‌న్నీకి అత్యంత ఆప్తుడు, ద‌ర్శ‌కుడు.. సుకుమార్‌.

 

ఈ రోజు పుష్ష టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో బ‌న్నీని ఐకాన్ స్టార్‌గా ప‌రిచ‌యం చేశారు. దీనికి సంబంధించి.. టీజ‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్ లో సుకుమార్ వివ‌ర‌ణ కూడా ఇచ్చాడు. బ‌న్నీని స్టైలీష్ స్టార్ గా ఎప్పట్నుంచి పిల‌వ‌డం మొద‌లెట్టారో తన‌కు తెలీద‌ని, ఇప్ప‌టి నుంచి తాను ఐకాన్ స్టార్ అని.. ప్ర‌క‌టించేశాడు. స్టైలీష్ స్టార్ అనే పిలుపులో త‌న పెర్‌ఫార్మ్సెన్ క‌నిపించ‌డం లేద‌ని, త‌న న‌ట‌న‌లో, స్టైల్‌లో, ఎంచుకునే పాత్ర‌ల్లో యునిక్‌నెస్ ఉంటుంద‌ని, అందుకే త‌న‌ని ఐకాన్ స్టార్ గా అభివ‌ర్ణించాన‌ని చెప్పుకొచ్చాడు సుకుమార్‌.

 

బ‌న్నీ కూడా త‌న‌ని ఐకాన్ స్టార్ గా మార్చినందుకు సుకుమార్ కి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. సుకుమార్ త‌న‌కోసం ఏం చేసినా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని, ఈ ఐకాన్ స్టార్ అనే పిలుపు కూడా బాగుంద‌ని చెప్పుకొచ్చాడు. `ఐకాన్ స్టార్‌.. స్టైల్ గుందిక‌దా, నాక్కూడా న‌చ్చింది` అంటూ.. అల వైకుంఠ‌పురంలోని డైలాగ్ ని మార్చి ప‌లికాడు బ‌న్నీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS