ప‌ట్ట‌ప‌గ‌లు 'దెయ్యం'గా మారిపోయింది

By iQlikMovies - April 07, 2021 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

రాంగోపాల్ వ‌ర్మ ఎప్పుడు సినిమా మొద‌లెడ‌తాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో చెప్ప‌లేం. అలానే సినిమాని ఎప్పుడు మ‌ధ్య‌లో వ‌దిలేస్తాడో కూడా చెప్ప‌లేం. వ‌ర్మ మొద‌లెట్టి, వ‌దిలేసిన సినిమాలు బోలెడున్నాయి. అందులో `ప‌ట్ట‌ప‌గ‌లు` ఒక‌టి. రాజ‌శేఖ‌ర్ హీరోగా వ‌ర్మ మొద‌లెట్టిన సినిమా ఇది. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని వ‌ర్మ మ‌ళ్లీ తెర‌పైకి తీసుకొచ్చాడు. టైటిల్ ని `దెయ్యం`గా మార్చి ఈనెల 16న విడుద‌ల చేయ‌బోతున్నాడు.

 

అయితే ఈ సినిమా విడుద‌ల అంత స‌వ్యంగా జ‌రిగే అవ‌కాశం లేదు. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ చాలా వివాదాలున్నాయి. ఈ సినిమాలోంచి రాజ‌శేఖ‌ర్ అర్థాంత‌రంగా బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. ఆయ‌న‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వ‌లేద‌ని టాక్‌. రాజ‌శేఖ‌ర్ ఈసినిమా విడుద‌ల‌ను అడ్డుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. `పోతే పోనీలే` అని రాజ‌శేఖ‌ర్ లైట్ తీసుకుంటే, ఈనెల 16న `ల‌వ్ స్టోరీ`తో పాటుగా ఈ దెయ్యాన్నీ చూడొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS