స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా క్రియేటివ్ ఫిలిం మేకర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్ తన సినిమాలకు ఎప్పుడూ దేవీని సంగీత దర్శకుడిగా ఎంచుకుంటారు. ఈ సారి కూడా ఆ ట్రెండ్ మార్చకుండా దేవీనే ఎంచుకున్నారు. అయితే ఈమధ్య దేవీ మ్యూజిక్ పై కాస్త విమర్శల జోరు పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మ్యూజిక్ సోసోగా ఉందని 'అల వైకుంఠపురములో' ఆల్బమ్ తో పోల్చి మరీ విమర్శలు గుప్పించారు.
దీంతో 'పుష్ప' విషయంలో దేవీ చాలా పట్టుదలగా ఉన్నారని, ఈ సినిమాకు ఎలాగైనా చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించి విమర్శకుల నోర్లు మూయించాలని ప్రయత్నిస్తున్నారట. ఈమధ్యే 'పుష్ప' సినిమా అకోసం ఒక ఐటెం నెంబర్ ట్యూస్ చేసి సుక్కు, బన్నీలకు వినిపించడంతో వారు ఫిదా అయ్యారట. సుకుమార్ - దేవీ కాంబినేషన్లో వచ్చిన ఐటెం సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్లే. దీంతో ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో సూపర్ గా డాన్స్ చేసేందుకు వీలుండే ఊపున్న ట్యూన్ అందించారట.
ఒకవేళ ఇదే నిజమే అయితే స్టైలిష్ స్టార్ అభిమానులకు సూపర్ న్యూసే. దేవీ ట్యూనుకు బన్నీ డ్యాన్స్, సుక్కు చిత్రీకరణ తోడైతే ఇక తెలుగులోనే కాకుండా అన్నీ భాషలలో ఈ పాట మోత మోగించడం ఖాయమే మరి.