ఫిబ్రవరి నుండి బన్నీ న్యూ లవ్ స్టోరీ!

మరిన్ని వార్తలు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత చిత్రాన్ని బన్నీతో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా సుకుమార్ బన్నకి ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథను చెప్పాడు. ఈ కథకే బన్నీ ముందు ఓకే చెప్పిన... తరువాత వేరే కథ చేస్తే బాగుంటుందని ముఖ్యంగా లవ్ స్టోరీ చేద్దామని సుకుమార్‌ తో అన్నారట. దీంతో సుకుమార్ ఓ కొత్త న్యూ లవ్ స్టోరీని రాసినట్లు తెలుస్తోంది. స్టోరీకి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందట. స్క్రిప్ట్ లో హీరోయిన్ పాత్ర చాల బాగా వచ్చిందని తెలుస్తోంది.

 

స్వతహాగా సుకుమార్ తన ప్రతి సినిమాలోనూ కథానాయికలకు మంచి ప్రాధాన్యం ఇస్తూ.. వారి కోసం మంచి పాత్రలు రాస్తుంటారు. ముఖ్యంగా అన్ని విధాల వారి పాత్రలను కథలో ఇన్వాల్వ్ చేస్తుంటారు. కాగా అల్లు అర్జున్ తో చేస్తోన్న సినిమాలో కూడా హీరోయిన్ పాత్రను చాల బలంగా రాసుకున్నారట. అది కూడా పల్లెటూరి యువతి పాత్రట. ఇక ఈ పాత్రలో నటించనుంది రష్మిక మందన్నా. రష్మిక ఇప్పటివరకు చేసిన మూడు చిత్రాల్లోనూ మంచి పాత్రలే దక్కించుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి నుండి పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బన్నీ మొత్తానికి స్పీడ్ పెంచేశాడు. మూడు సినిమాలను వరుసగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తోన్న 'అల వైకుంఠపురములో' సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ. ఒక పక్క త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి అంగీకరించాడు.

 

నిజానికి సుకుమార్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళటానికీ చాలా కాలం ఎదురుచూసిన అల్లు అర్జున్.. సుకుమార్ కోసం బల్క్ డేట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడట. మొదటగా విడుదలైయ్యే త్రివిక్రమ్ సినిమాలో కాస్త వైవిధ్యంగా బన్నీ కనిపించనున్నాడట. బన్నీ డ్రెసింగ్ స్టైల్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకూ ఈ సినిమాలో కొత్త అల్లు అర్జున్ ని చూస్తామని తెలుస్తోంది. 'సన్నాఫ్ సత్యమూర్తి’లో కూడా బన్నీ మాడ్యులేషన్ని కాస్త కొత్తగా మార్చాడు త్రివిక్రమ్. అలాగే ఈ సినిమాలోనూ కొత్త బన్నీని చూపిస్తాడట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS