కరోనా విజృంభిస్తోంది. స్టార్ హీరోల్నీ వదిలిపెట్టడం లేదు. మెగా కుటుంబంలో సైతం కరోనా చొచ్చుకుపోయింది. మొన్నామధ్య పవన్ కల్యాణ్ కరోనా బారీన పడ్డారు. ఆరతవాత కల్యాణ్ దేవ్ కి కరోనా సోకింది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా కోవిడ్ బారీన పడ్డారు. ఈ విషయాన్ని బన్నీనే ధృవీకరించారు. తనకు కరోనా పాజిటీవ్ అని తేలిందని, ప్రస్తుతం ఐసొలేషన్‌లో ఉన్నానని, ఇటీవల తనని కలసిన వాళ్లంతా.. విధిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. అల్లు అరవింద్ సైతం ఆమధ్య కోవిడ్ కి గురయ్యారు. కానీ.. త్వరగానే కోలుకున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ష`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ష షూటింగ్ హైదరాబాద్ లో నిరాటంకంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో.. పుష్ష టీమ్ సభ్యులు సైతం.. కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.