బ‌న్నీ పార్టీ అదిరింది

By iQlikMovies - November 19, 2018 - 12:25 PM IST

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య అల్లు అర్జున్ ఓ మంచి అల‌వాటు  చేసుకున్నాడు. సినిమా ఏదైనా హిట్ట‌యితే - ఆ బృందాన్ని పిలిచి ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నాడు. ఓ మంచి పార్టీ కూడా ఇస్తున్నాడు. మ‌హాన‌టి, గీతా గోవిందం సినిమాలు విజ‌య‌వంత‌మైన‌ప్పుడు బ‌న్నీ ఇలానే పార్టీలు ఇచ్చాడు. 

ఇప్పుడు ఆ ఆన‌వాయితీ కొన‌సాగిస్తూ... `టాక్సీవాలా` చిత్ర‌బృందానికీ ఘ‌నంగా పార్టీ ఇచ్చాడు బ‌న్నీ.  విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఈ చిత్రానికి రాహుల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతాఆర్ట్స్ 2, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించాయి. శ‌నివారం విడుద‌లైన ఈ చిత్రం మంచి వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. అందుకే ఆదివారం రాత్రి బ‌న్నీ మంచి పార్టీ ఇచ్చాడు. 

ఈ పార్టీలో చిత్ర‌బృందం మొత్తం పాలుపంచుకుంది. ఓ హీరో, మ‌రో హీరో న‌టించిన సినిమాని మెచ్చుకోవ‌డం, ఇలా పార్టీలు ఇవ్వ‌డం గొప్ప విష‌య‌మే. ఈ సంప్ర‌దాయాన్ని ఇత‌ర హీరోలూ కొన‌సాగిస్తే బాగుంటుందేమో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS