బన్నీ - త్రివిక్రమ్‌ ఈసారి నవ్వుల్‌ నవ్వుల్‌.!

మరిన్ని వార్తలు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు. నెక్స్‌ సినిమా ఏంటనే విషయంలో అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు ఒకానొక సందర్భంలో సమాధానం కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయాడు బన్నీ. 

ఇక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాదాపు బన్నీ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ కన్‌ఫామ్‌ అయినట్లే. త్రివిక్రమ్‌ - బన్నీ కాంబోలో సినిమా ఉండబోతోందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఇక అఫీషియల్‌ ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా ఓ హిందీ సినిమాకి రీమేక్‌గా రూపొందుతోందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి బన్నీ నుండి రాబోయే సినిమా ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందట. 

ఈ మధ్య బన్నీ యాక్టింగ్‌ స్కిల్స్‌లో చాలా మార్పులొచ్చేశాయి. గత చిత్రాలను తీసుకుంటే, దాదాపు అన్ని సినిమాల్లోనూ సీరియస్‌గా బిగుసుకుపోయినట్లే కనిపిస్తున్నాడు. అయితే ఈ సారి బాడీలాంగ్వేజ్‌లో ఫుల్‌ చేంజ్‌ ఓవర్‌ చూపించనున్నాడట. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందనీ తెలుస్తోంది. త్రివిక్రమ్‌ తీరు కూడా ఇదే. సంభాషణల్లో వాడీ వేడీ చూపిస్తూనే ధియేటర్‌లో నవ్వులు పూయించదగ్గ సత్తా ఉన్నోడు త్రివిక్రమ్‌. అలాంటిది 'అజ్ఞాతవాసి' ఫెయిల్యూర్‌తో త్రివిక్రమ్‌లో చాలా మార్పులొచ్చేశాయి. 'అరవింద సమేత..' ఏదో కొట్టుకెళ్లిపోయింది. 

కానీ ఈ సారి బన్నీ సినిమాతో త్రివిక్రమ్‌ తన పాత రోజుల్ని గుర్తు చేసుకోబోతున్నాడట. 'మల్లీశ్వరీ', నువ్వే నువ్వే' తరహాలో సంభాషణలు రచించేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నాడనీ సమాచారమ్‌. అన్నట్లు ఈ సినిమాలో 'భరత్‌' బ్యూటీ కైరా అద్వానీని హీరోయిన్‌గా ఎంచుకునే యోచనలో త్రివిక్రమ్‌ అండ్‌ టీమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS