తెలుగులో అతి కొద్ది సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని అందుకుంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఇప్పుడు రకుల్ హవా తెలుగులో దాదాపు తగ్గిపోయింది. రూమర్స్‌కీ, గాసిప్స్‌కీ తప్ప, అవకాశాలకు తావే లేదు తెలుగులో రకుల్ కెరీర్‌కిప్పుడు. అయితే ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్‌లో ఎలాగోలా అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర దక్కించుకుంది.
ఇది చాలదు రకుల్‌కి తెలుగులో ఎలాంటి పట్టం కట్టారో అనడానికి. అయితే పాత్ర పరంగా పేరున్నా, ప్రాధాన్యత పరంగా అంతగా పేరు దక్కని పాత్ర ఇది. ఇకపోతే తెలుగులో రకుల్ ఓ బంపర్ ఛాన్స్ అందుకోబోతోందని విశ్వసనీయ వర్గాల తాజా సమాచారమ్. అదీ ఓ ప్రముఖ హీరో సినిమాలోనట. అయితే ప్రస్తుతానికి ఆ వివరాల్ని గోప్యంగా ఉంచుతున్నారు. త్వరలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు రివీల్ చేస్తానంటోంది రకుల్ ప్రీత్‌సింగ్.
తెలుగు సంగతిటుంచితే, తమిళంలో రెండు చిత్రాలు ఆల్రెడీ సెట్స్‌పై ఉన్నాయి. మరో చిత్రానికి కమిట్ అయ్యింది. అలాగే బాలీవుడ్‌లో అజయ్‌దేవగన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ లవర్‌గా బబ్లీ క్యారెక్టర్ పోషిస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. సినిమాల సంగతిటుంచితే, ఎప్పుడూ ఫిట్‌నెస్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేసే రకుల్ ప్రీత్‌సింగ్ ఫిజిక్‌లో ఎలాంటి మార్పులూ రాకపోయినా, ఫిట్‌నెస్‌ని మాత్రం వదిలిపెట్టదు. ఎక్కువ టైం జిమ్‌లోనే గడిపే అందాల భామల వరసలో రకుల్ పేరు ముందు వరసలోనే ఉంటుంది.
తాజాగా రకుల్ 40 కేజీల బరువు ఎత్తుతూ జిమ్‌లో కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ వీడియోకి నెటిజన్లు 'అయ్యో పాపం రకుల్‌కి ఎంత కష్టమొచ్చిందో..' అంటూ రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.