మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని హారిక హాసిని సంస్థ నిర్మించనుంది. ఇందులో మహేష్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తాడని ప్రచారం సాగింది. ఈమధ్య మహేష్ తరచూ తన సినిమాల్లో పారితోషికంతో పాటు, వాటా కూడా అందుకుంటున్నాడు. అలానే ఈ సినిమాకీ వాటా ఉంటుందని భావించారు. కానీ... హారిక హాసిని నే సోలోగా ఈ సినిమాని హ్యాండిల్ చేస్తోంది.
నిజానికి మహేష్ ఈసినిమాలోనూ వాటా అడిగాడని టాక్. అయితే.. త్రివిక్రమ్ దాన్ని సరైన రీతిలో హ్యాండిల్ చేసి, పారితోషికంతోనే సరిపెట్టాడట. హారిక హాసినిలో త్రివిక్రమ్ కి వాటా ఉంది. ఇప్పుడు మహేష్ నీ భాగస్వామిగా చేస్తే.. వాటాలు పెరిగిపోతాయి. దాంతో... త్రివిక్రమ్ తన చాతుర్యం చూపించాడని టాక్. నిజానికి.. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా పట్టాలెక్కాలి. ఆ సినిమా సైడ్ అవ్వడం వల్లే.. మహేష్ - త్రివిక్రమ్ కాంబో ఓకే అయ్యింది. ఎన్టీఆర్ తో సినిమా చేస్తే గనుక.. కల్యాణ్ రామ్ కూడా నిర్మాతగా మారేవాడు.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి ఉన్న కొన్ని కారణాల్లో... అది కూడా ఒకటని తెలుస్తోంది. హారిక హాసినికి ముందు నుంచీ సొలోగానే ప్రొడక్షన్ చేయడం ఇష్టం. ఆ లెక్కలన్నీ... త్రివిక్రమ్ నే స్వయంగా చూసుకుంటాడు. మరొకరితో లెక్కలు మొదలెడితే.. లేనిపోని పేచీలు వస్తాయన్న భయాలు కూడా ఉన్నాయని, క్రియేటీవ్ ఫీల్డ్ లో.. ఇలాంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని త్రివిక్రమ్ ఆలోచన. అందుకే.. హాసిని చేతిలో ఈ సినిమా మొత్తం పెట్టేశాడు.