మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ట్విట్టర్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ధూమ్ ధామ్ అంటూ బ్యాటింగ్ ఇరగదీసేస్తున్న వేళ, సెలబ్రిటీలంతా తమదైన స్టైల్‌లో మెగాస్టార్ చిరంజీవికి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ, ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్, చరణ్, వెంకీ.. ఇలా సెబ్రిటీలంతా హార్టీ వెల్‌కమ్ చెబుతున్నారు చిరంజీవికి. అయితే, ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే, అల్లు అర్జున్ నుండి ఇంతవరకూ చిరంజీవికి వెల్‌కమ్ ట్వీట్ రాలేదంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే, అల్లు అర్జున్ నుండి రావల్సిన ట్వీట్ రానే వచ్చింది. నిజానికి అల్లు అర్జున్‌కి చిరంజీవి అంటే చాలా ఇష్టం. చాలా సార్లు ఆ ఇష్టాన్ని బహిర్గతం చేస్తూనే వచ్చాడు బన్నీ. అవకాశమొచ్చినప్పుడల్లా, చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని వ్యక్త పరుస్తూనే ఉంటాడు బన్నీ. ఇక లేటెస్ట్ ట్వీట్‌తో ట్రోల్ చేస్తున్న వారి మౌత్స్ షట్ డౌన్ చేసేసాడు.
ఇకపోతే, బన్నీ ప్రస్తుతం సుకుమార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ లోగా సినిమాకి సంబంధించి మేకోవర్‌పై బన్నీ దృష్టి పెట్టాడు. ఇప్పటికే కావల్సిన లుక్స్‌లోకి బన్నీ వచ్చేశాడు. గుబురు గెడ్డంతో చిత్తూరు కుర్రోడిలా కనిపించనున్నాడు ఈ సినిమాలో బన్నీ. చిత్తూరు యాస కోసం ప్రత్యేకంగా ట్యూటర్‌ని పెట్టుకుని యాసను ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మికా మండన్నా నటిస్తోంది.
I wholeheartedly Welcome our Megastar Garu to Twitter . Been waitinggg for this happen for a long time now . Finally ! @KChiruTweets Now on Twitter .
— Allu Arjun (@alluarjun) March 26, 2020