మ‌హేష్ అభిమానుల మ‌న‌సు గెలుచుకున్న బ‌న్నీ.

By Gowthami - January 07, 2020 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

స‌రిలేరు నీకెవ్వ‌రు - అల వైకుంఠ‌పుర‌ములో సినిమాల మ‌ధ్య భీక‌ర‌మైన పోటీ జ‌రుగుతోంది. నిజానికి ఈ రెండు సినిమాలూ ఒకే రోజున విడుద‌ల కావాల్సింది. ప్రొడ్యూస‌ర్ గిల్డ్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌ల్ల ఒక రోజు ఆల‌స్యంగా విడుదల అవుతున్నాయి. అయినా స‌రే, పోటీ పోటీనే. నువ్వా? నేనా అంటూ ఒక రోజు వ్య‌వ‌ధితో కోడి పుంజుల్లా త‌ల‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అల వైకుంఠ‌పురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా త‌న సినిమాని చూడ‌మంటూనే మ‌హేష్ బాబు సినిమా కూడా స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకున్నాడు బ‌న్నీ. మిగిలిన సినిమాలూ బాగా ఆడాల‌ని అన్నాడు.

 

ఈ ఈవెంట్ లో బ‌న్నీ మాట్లాడుతూ ''చిరంజీవిగారి త‌ర్వాత నాకు ఇష్ట‌మైన వ్య‌క్తి ర‌జినీకాంత్‌గారే. అలాంటి ర‌జినీకాంత్‌గారి సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఇష్ట‌మైన డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌గారు చేసిన సినిమా. ఈ సంక్రాంతికి ఆయ‌న సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. అలాగే మా సినిమాతో పాటు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా కూడా విడుద‌ల‌వుతుంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. అలాగే నాకు ఎంతో ఇష్ట‌మైన వ్య‌క్తి క‌ల్యాణ్‌రామ్‌గారి ఎంత‌మంచివాడ‌వురా సినిమా విడుద‌ల‌వుతుంది. ఆయ‌న‌కు కూడా అభినంద‌న‌లు. ఈ సంక్రాంతి అంద‌రికీ బావుండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నాడు.

 

ఈ విధంగా మ‌హేష్ అభిమానుల మ‌న‌సు గెల‌చుకోగ‌లిగాడు. స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రీ రిలీజ్ వేడుక‌లో బ‌న్నీ అల వైకుంఠ‌పురముతో పాటు మిగిలిన సినిమాల్ని అస్స‌లు ప్ర‌స్తావించ‌లేదు. ఈ విష‌యంలో బ‌న్నీనే కాస్త గ్రేటు అనుకోవాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS