'ఆ' బరిలో అమలాపాల్‌.!

మరిన్ని వార్తలు

మొన్న విజయ్‌, నిన్న హన్సిక దమ్ము కొట్టిన పోస్టర్స్‌తో అనవసరంగా వివాదాల బాట పట్టారు. అయినా నాకేం పట్టలేదన్నట్లుగా నటి అమలాపాల్‌ ఇప్పుడు బరిలోకి దూకింది. సిగరెట్‌ తాగుతూ ఫోటోకి పోజిచ్చి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ఇంకేముంది. నెటిజన్లు ఊరుకుంటారా.? ఆడి పారేసుకుంటున్నారు. 

 

అయితే ఈ అందాల బ్యూటీకి అందంతో పాటు కాంట్రవర్సీలు కూడా ఎక్కువే. ఏదో ఒక కాంట్రవర్సీతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా అమలాపాల్‌ సోషల్‌ మీడియా నెటిజన్స్‌ హంట్‌లో ట్రెండింగ్‌ అయిపోయింది. ఆమె దమ్ము కొడుతున్నట్లు దిగిన ఫోటోపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఈ ముద్దుగుమ్మ చెప్పిన రీజన్‌ ఏంటంటే తన హాలీవుడ్‌ ఫ్యాన్‌ కోరిక మేరకు ఇలా కనిపించానంతే. నిజంగా నాకు దమ్ము కొట్టేవాళ్లంటే అస్సలు ఇష్టముండదు అని వివరణ ఇచ్చుకుంది కూడా. 

 

అంటే తనకు హాలీవుడ్‌ నుండి కూడా ఫ్యాన్స్‌ ఉన్నారు అని అమలాపాల్‌ ఈ రకంగా చెప్పుకునే ప్రయత్నం చేసిందా.? లేక తాను చేసినది తప్పు అని తెలిసి కవరింగ్‌ ఇచ్చుకుందో ఏమో కానీ, నెటిజన్స్‌ అమలాపాల్‌ని ఓ రేంజ్‌లో వాష్‌ చేసి వదిలేస్తున్నారంతే. అన్నట్లు ఇటీవలే ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా అమలాపాల్‌ మందు తాగుతూ కూడా పోజిచ్చింది. చేతిలో నాటు సారా సీసాతో లుంగీ ఎగ్గట్టి మాస్‌ ఊరమాస్‌ అంటూ పోజిచ్చేసింది. ఆల్రెడీ ఈ పోజు కూడా నెటిజన్స్‌కి సుపరిచితమే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS