అమలాపాల్‌కి ఆలాంటి ఆలోచనల్లేవు

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ అమలాపాల్‌, డైరెక్టర్‌ విజయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిన్న చిన్న డిస్ట్రబెన్స్‌ కారణంగా ఒక అండర్‌ స్టాండింగ్‌తో ఈ మధ్యే విడాకులు తీసుకున్నారు. అయితే తాజాగా విజయ్‌ మరో వివాహం చేసుకోవాలనుకుంటున్నారట. అయితే అమలా పాల్‌ మాత్రం తనకప్పుడే అలాంటి ఆలోచనలేం లేవంటోంది. తన దృష్టి పూర్తిగా సినిమాల పైనే ఉందంటోంది. తనకి ఎంతో సినీ కెరీర్‌ ఉందంటోంది. మంచి నటిగా మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నానంటోంది అమలా పాల్‌. ఈలోగా ప్రేమా గీమా జాన్తా నహీ.. ఫుల్‌ ఫోకస్‌ మూవీస్‌ పైనే అంటోంది ముద్దుగుమ్మ అమలా పాల్‌. సినిమాల్లో నటించడానికి ఒప్పుకోని కారణంగానే విజయ్‌తో వివాహం రద్దు చేసుకుంది అమలాపాల్‌. అలాంటిది కెరీర్‌లో బిజీ అయ్యాక, మళ్లీ ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే అవకాశమే లేదంటోంది. వివాహ రద్దు తర్వాత ముద్దుగుమ్మ అమలాపాల్‌ సినిమాల్లో చాలా బిజీ అయిపోయింది. తమిళంలోనే ఆమె చేతిలో చాలా సినిమాలున్నాయి. అన్నీ బిగ్‌ ప్రాజెక్ట్సే కావడం విశేషం. అలాగే మలయాళంలో కూడా అమ్మడు సినిమాలు చేస్తోంది. అవకాశం వస్తే తెలుగులోనూ నటిస్తానంటోంది. ఇప్పటికే 'నాయక్‌', బెజవాడ' సినిమాల్లో నటించింది. తెలుగు పరిశ్రమ అంటే తనకెంతో అభిమానమనీ, చేసినవి తక్కువ సినిమాలే అయినా కానీ తెలుగు ప్రేక్షకులు తనను బాగా ఆదరించారనీ అంటోంది ముద్దుగుమ్మ అమలాపాల్‌. 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS