వెంకటేష్ కొత్త సినిమా 'గురు'. ఈ సినిమా ఎప్పుడో జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. రైట్ టైం కోసం వెంకటేష్ ఎదురు చూస్తున్నాడట. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. కమర్షియల్ యాంగిల్‌లో కాకుండా ఇంతవరకూ 'దృశ్యం', గోపాలా గోపాల' వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల్లో నటించాడు వెంకటేష్. ఆ సినిమాలు వెంకీకి మంచి విజయాలే తెచ్చిపెట్టాయి. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'సాలా ఖదూస్'కి తెలుగు రీమేకే ఈ 'గురు'. ఈ సినిమా కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. బాగా ఒళ్లు పెంచాడు. లుక్ మొత్తం మార్చేశాడు. గెడ్డం పెంచాడు. టోటల్లీ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. బాక్సింగ్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు వెంకీ ఈ సినిమాలో. మాతృకలో మాధవన్ ఈ పాత్రను పోషించాడు. రితికా సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. మాతృకలో దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగులో కూడా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో ఉంది చిత్ర యూనిట్. కమర్షియల్ యాంగిల్‌లో కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసిన వెంకీ ప్రయత్నం ఫలించాలంటే ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి. 'బాబు బంగారం' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తర్వాత వస్తోన్న వెంకీ చిత్రమిది.