ఇసుకలో అందాల భామల సొగసులు మరింత రెట్టింపు అవుతాయని ఎందరో ముద్దుగుమ్మలు నిరూపించేశారు. జరా జరా పాకే విషంలా అంటూ ఇసుక తిన్నెల్లో ఓ ముద్దుగుమ్మ నిషా కళ్లతో వేసిన చిందులకు కుర్రకారు గుండెలు గల్లంతయిపోయాయ్ ఒకప్పుడు. సరే అది పాత సంగతిలెండి. తాజాగా ముద్దుగుమ్మ అమలాపాల్ ఇసుక తిన్నెల్లో తన అందాలకు సొగసులద్దిందిలా. చేతిలో జ్యూయలరీ బాక్సుతో లూజ్ హెయిర్‌తో, ఫేస్‌లో హాట్ అండ్ వైల్డ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి పిచ్చెక్కించేసింది.
ఆ ఎక్స్‌ప్రెషన్‌కి సముద్రపు అలలు కూడా నేను ముందంటే నేను ముందంటూ అమ్మడి అందాల్ని ముద్దాడేందుకు పరుగులు తీస్తున్నాయి చూశారా.? సముద్రపు అలల కన్నా వేగంగా కుర్రకారు ఊహలు పరుగెత్తేస్తున్నాయి. ఇదీ అమలా గ్లామర్ పోజు కథ. ఇదిలా ఉంటే అమలాపాల్ తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా, సక్సెస్‌ఫుల్ మూవీస్ అవి. ప్రస్తుతం మలయాళంలో బిజీగా ఉంది. తమిళంలో ఒకటీ అరా సినిమాలు చేస్తోంది హాట్ హాట్ అమలాపాల్.