అయ్యో చరణ్‌ హీరోయిన్‌ విలన్‌గా మారిందా.!

By iQlikMovies - April 03, 2018 - 07:00 AM IST

మరిన్ని వార్తలు

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సరసన 'నాయక్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించింది ముద్దుగుమ్మ అమలాపాల్‌. ఆ తర్వాత నాగ చైతన్యతో 'బెజవాడ' చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ తమిళ, మలయాళంలో ఈ బ్యూటీకి భలే క్రేజ్‌ ఉందిలే. తమిళ డైరెక్టర్‌ని పెళ్లి చేసుకుంది. కానీ వెంటనే బ్రేక్‌ అప్‌ చేసుకుని, సినిమాల్లో మళ్లీ బిజీ అయిపోయింది. 

పెళ్లి బ్రేక్‌ అప్‌ అయ్యాకా అమలాపాల్‌ కెరీర్‌ జెట్‌ స్పీడుతో దూసుకెళ్లిపోతోంది. తమిళంలోనూ, మలయాళంలోనూ ఈ బ్యూటీ చేతిలో కుప్పలు తెప్పలుగా సినిమాలున్నాయి. ఇదే తరుణంలో ఓ బైలింగ్వల్‌ మూవీలోనూ నటిస్తోంది అమలాపాల్‌. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నిజర్‌ షఫీ తెరకెక్కిస్తున్నారు. కెమెరామేన్‌గా పని చేసిన నిజర్‌ షఫీ ఈ సినిమాతోనే మెగా ఫోన్‌ పడుతున్నారు. తెలుగులో మారుతి దర్శకత్వంలో వచ్చిన 'భలే భలే మగాడివోయ్‌', 'మహానుభావుడు' చిత్రాలకు ఈయన కెమెరామేన్‌గా పని చేశారు. కాగా షఫీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషిస్తోందట. 

గ్లామర్‌ రోల్స్‌తో పాటు, విభిన్న పాత్రలు కూడా పోషించినప్పుడే తనలోని నటికి అసలు సిసలు సవాల్‌ విసిరినట్లవుతుందంటోంది అమలాపాల్‌. అలాంటి ఛాలెంజింగ్‌ రోల్‌ తనకు ఈ సినిమా ద్వారా దక్కిందనీ సంతోషం వ్యక్తం చేస్తోంది. 'నాయక్‌' సినిమాలో చరణ్‌కి మరదలిగా నటించిన డస్కీ బ్యూటీ అమలాపాల్‌ని త్వరలోనే తెలుగు ప్రేక్షకులు విలన్‌గా చూడబోతున్నారన్న మాట. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS