కౌశల్ ఆర్మీ 2K వాక్

By iQlikMovies - September 09, 2018 - 17:53 PM IST

మరిన్ని వార్తలు

ఇప్పుడు అంతర్జాలంలో బిగ్ బాస్ కి సంబంధించిన ఏ టాపిక్ చర్చకి వచ్చినా అందులో ప్రముఖంగా వినిపించేది కౌశల్ ఆర్మీ గురించే.. అయితే ఇప్పుడు ఆ కౌశల్ ఆర్మీ ఏ స్థాయికి చేరిందంటే ఈ రోజు హైదరాబాద్ లో కౌశల్ ఆర్మీ పేరిట ఆయనకి మద్దతుగా 2K వాక్ నిర్వహించారు ఆయన అభిమానులు.

దీనికి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లుకోడుతున్నాయి. అయితే అసలు ఈ షోకి ముందు కౌశల్ గురించి తెలిసిన వారు చాలా తక్కువే అని చెప్పాలి. ఇక ఈ షో మొదలయ్యాక మాత్రం అతనికి సోషల్ మీడియా వేదికగా ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగిపోయింది.

ఇక ఇప్పటికే ఆయన టైటిల్ గెలుస్తాడు అని ఆయన అభిమానులు, టాప్ 2లో ఉంటాడు అని షో చూస్తున్న సామాన్యులు తమ తమ లెక్కలు వేసుకుంటున్నారు.

ఈ తరుణంలో ఆయన టైటిల్ గెలుస్తాడా? ఆయనకి మద్దతుగా వస్తున్న ఇంతమంది ఫ్యాన్స్ ఆశ నెరవేరుతుందా అనేది ఇంకొక రెండు వారాలు ఆగితే తెలిసిపోతుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS