ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కి కరోనా పాజిటీవ్ అని తేలడంతో.. ముంబైలోని నానావతీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అమితాబ్ తో పాటుగా అభిషేక్కీ కరోనా సోకడం.. ఆయనకూడా అదే ఆసుపత్రిలో చేరడం తెలిసిన విషయాలే. అయితే అమితాబ్ ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుట పడుతోందని టాక్. మరో వారం రోజుల్లో అమితాబ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని నానావతీ ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు.
అభిషేక్ సైతం ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నార్ట. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన్ని కూడా ఆసుపత్రిలోనే ఉంచేసినట్టు తెలుస్తోంది. అమితాబ్,అభిషేక్‌లకు ఇతర అనారోగ్య సమస్యలేం లేకపోవడం వల్ల త్వరగా కోలుకున్నారని సమాచారం. మరోవైపు ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలు సైతం కరోనాతో బాధ పడుతున్నారు. అయితే.. వాళ్లు హోం క్వారెంటైన్‌లోనే చికిత్స పొందుతున్నారు. అమితాబ్ ఇంట్లో పనిచేసే సిబ్బందికి సైతం కరోనా టెస్టులు చేయించారు. వాళ్లకు నెగిటీవ్ రిపోర్ట్ రావడంతో.. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.