12 ఏళ్ల క్రితం 'అతిధి' సినిమాలో మహేష్‌కి జోడీగా నటించింది ముద్దుగుమ్మ అమృతారావ్. మళ్లీ ఇప్పుడు కొత్తగా వార్తల్లోకెక్కింది. ఒకసారి సుపరిచితురాలైన ముద్దుగుమ్మలు లాంగ్ గ్యాప్ తర్వాత కనిపిస్తే మనవాళ్లు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించకుండా వదిలేస్తారా.? అందుకే ఒక్క సినిమాతోనే ఎందుకు మాయమైపోయారు అని అమృతారావ్ని ప్రశ్నలతో విసిగిస్తున్నారు.
అందుకు ఆమె చెప్పిన సమాధానం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్‌ని గ్లామర్ డాళ్స్గానే చూపిస్తారు అందుకే తెలుగు సినిమాని విడిచి పెట్టేశాను అని సమాధానమిచ్చింది అమృతారావ్. ఇదిలా ఉంటే, ఈ బ్యూటీ మహేష్‌ని మాత్రం పొగడ్తలతో ముంచెత్తేస్తోంది. మహేష్ తనకు మంచి పాత్ర ఇచ్చారనీ, చాలా రెస్పెక్ట్‌గా చూసేవారనీ, అలాగే మహేష్ కుటుంబ సభ్యులతో మంచి సాన్నిహిత్యం ఉందనీ చెప్పుకొచ్చింది.
అయితే ఇంతకీ అమృతారావ్ మళ్లీ ఎందుకు మీడియాకెక్కినట్లు.? అంటే ఇంకేముంది.? అవకాశాల కోసమే. ఏదో ఒక రకంగా పబ్లిసిటీ స్టంట్ చేసి, వార్తల్లోకెక్కి ఫేమస్ అయిపోయి తర్వాత ఆఫర్లు అందుకోవడమే కదా ముద్దుగుమ్మల టార్గెట్. అయితే కొందరు భామలు సోషల్ మీడియాలో తమ గ్లామర్‌తో వల వేసి గాలమేస్తుంటే, మరికొందరు భామలు ఇలా నోరు ఉపయోగించి గాలమేస్తున్నారు. ఏ వల టార్గెట్ అయినా ఒక్కటే, అవకాశాలే. మరి ఈ నోటి దురుసుతో అమృతారావ్ ఎలాంటి ఆఫర్స్ దక్కించుకుంటుందో చూడాలిక.