గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన్న

మరిన్ని వార్తలు

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో వంటి చిన్న చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమై.. రెండో సినిమా గీత గోవిందంలో ఏకంగా యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నాని సరసన నటించిన దేవదాసు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో.. టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా ఖ్యాతిని దక్కించుకుంది ఈ కన్నడ హీరోయిన్.

 

తాజాగా ఈ లక్కీ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న తన 19వ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక సెలెక్ట్ అయ్యిందని తాజా సమాచారం. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్న రష్మికకు అదృష్టం ఇలా తలుపు తట్టింది. అంతేనండీ.. లక్ అంటూ ఒక్కసారి వస్తే దాన్ని ఎవరూ ఆపలేరు. అల్లు అర్జున్ సరసన నటించబోయే ఈ సినిమా కూడా హిట్ అయితే ఇంకొన్ని సంవత్సరాలు రష్మిక వెనక్కి తిరిగి చూసుకోవలసిన పని ఉండదు. 

 

కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ నటిస్తున్న "డియర్ కామ్రేడ్" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా నితిన్ సినిమాతో పాటు.. మరో రెండు సినిమాలకు సైన్ చేసిందట. ప్రస్తుతానికి టాలీవుడ్ ఈ కన్నడ బ్యూటీ రష్మిక మైకంలో ఉందనటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS