ఇదివరకు హీరోయిన్లు తల్లి కాబోతున్నారన్న విషయాన్ని వీలైనంత గోప్యంగా ఉంచేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎక్స్‌పోజింగ్‌లో ఇదో రకం ఎక్స్పోజింగ్. పబ్లిసిటీ స్టంట్‌లో ఇదో కొత్త పబ్లిసిటీ స్టంట్. నేను తల్లి కాబోతున్నానహో.. అంటూ ప్రూఫ్స్‌తో సహా న్యూస్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. తాజాగా సమీరారెడ్డి, అమీజాక్సన్‌ల ఈ ప్రెగ్నెన్సీ పబ్లిసిటీ నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.
మొన్న స్విమ్ సూట్లో సమీరారెడ్డి బేబీ బంప్ పిక్స్ పోస్ట్ చేయగా, నేడు తన బోయ్ ఫ్రెండ్‌తో అమీ జాక్సన్ విత్ బేబీ బంప్ ఫోటోల్ని పోస్ట్ చేసి మురిసిపోతోంది. ఆల్రెడీ మొన్నామధ్య బేబీ బంప్‌తో బోయ్‌ఫ్రెండ్ జార్జ్‌తో కలిసి ఉన్న స్టిల్‌ని ఇమేజ్‌లో చూపించి కన్ఫామ్ చేసింది. మరోసారి ఇప్పుడు రియల్ బేబీ బంప్‌ని చూపిస్తూ బోయ్ ఫ్రెండ్ ఒళ్లో పడుకుని సరదాగా దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేసి ఇంకోసారి కన్ఫామ్ చేసింది అందాల అమీజాక్సన్.
ప్రస్తుతం అమీజాక్సన్ జార్జ్‌తో లివింగ్ రిలేషన్ షిప్లో ఉంది. దుబాయ్‌లో ఈ జంట వేకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ హాయిగా సేద తీరుతున్నారు. ఆ ఎంజాయ్‌మెంట్‌ని ఇలా ఫోటోలతో అభిమానులకు షేర్ చేస్తోంది. తెలుగులో 'ఎవడు' సినిమాలో నటించిన అమీజాక్సన్ ఇటీవల 'రోబో 2.0' సినిమాలో లేడీ రోబోగా కనిపించి మెప్పించింది. రోబో తర్వాత మరో కొత్త సినిమాకి సైన్ చేయలేదు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ ఎంజాయ్మెంట్లో ఫుల్ బిజీగా గడుపుతోంది.