ఇటీవల లేడీ రోబోగా '2.0' సినిమాలో సూపర్ స్టార్ పక్కన చిందేసిన ముద్దుగుమ్మ అమీజాక్సన్ తల్లి కాబోతోంది. ఇదేం గాసిప్ కాదండోయ్. మొదట్లో గాసిప్ అనుకున్నా, లేటెస్ట్గా అమీజాక్సనే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకునేందుకు చాలా సంతోషిస్తున్నా.. అంటూ పెళ్లి కాకుండానే తల్లి అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానుల ముందు రివీల్ చేసింది. అక్టోబర్‌లో డెలివరీ అయ్యే అవకాశాలున్నాయట. బేబీ బంప్‌తో ప్రియుడు జార్జ్ పనాయోటూతో కలిసి దిగిన పిక్‌ని కూడా పోస్ట్ చేయడంతో అభిమానులు నమ్మక తప్పలేదు.
గత ఆరేళ్లుగా జార్జ్‌తో లవ్ అండ్ డేటింగ్లో ఉన్న అమీజాక్సన్ ఇటీవలే ఆయనతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. వచ్చే ఏడాది వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. అంటే అర్జున్‌రెడ్డి సినిమాలో చూశారుగా ప్రెగ్నెన్సీతో హీరోయిన్ పెళ్లి పీటలెక్కుతుంది. బట్ ఇక్కడ ఇంకొంచెం ఛేంజ్. అంతకు ముందే డెలివరీ అయిపోతుంది కాబట్టి, తల్లిగానే అంటే బిడ్డతో పాటు పెళ్లి పీటలెక్కుతుందన్న మాట అమీ.
మొత్తానికి లేడీ రోబో భలే పని చేసిందిలే. 'రోబో 2.0' తర్వాత అమీజాక్సన్ మరే సినిమా ఒప్పుకోలేదు. గతంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో 'ఎవడు' సినిమాలో నటించింది అమీజాక్సన్. ఆ తర్వాత తెలుగులోనూ మరో సినిమాలో నటించలేదు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న అమీజాక్సన్, బహుశా ఆ తర్వాత మళ్లీ కెరీర్‌పై దృష్టి పెడుతుందేమో చూడాలిక.