'మనసుకు నచ్చింది' సినిమాతో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్. అన్నీ ఉన్నా, అదృష్టం కలిసి రాలేదీ ముద్దుగుమ్మకి. అందంతో, అంతకుమించిన హాట్ అప్పీల్, చాలినంత అభినయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఉండాల్సినవన్నీ ఉన్నాయి. కానీ ఏం లాభం. ఆ ఒక్కటీ లేకుంటే ఎలా.? అమైరాలానే ఉంటుందిలా. అదే అదృష్టం. అయితే సినిమాల సంగతెలా ఉన్నా, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడే హాట్ హాట్ పిక్స్‌తో తెగ సెగలు పుట్టించేస్తూ ఉంటుంది. అలా బోలెడంత ఫాలోయింగ్ సంపాదించేసింది అమైరాదస్తూర్.
ఇదిలా ఉంటే, బాలీవుడ్‌లో అమ్మడు ఒకటీ అరా సినిమాలతో సందడి చేస్తోంది. అమైరా నటిస్తున్న 'మెంటల్ హై క్యా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో 'ఉడి ఉడి ఉజైకానుమ్' సినిమాలో నటిస్తోంది. తెలుగులోనే పెద్దగా ఆఫర్లు అందుకోలేకపోతోంది. అయితే లేటెస్ట్‌గా తెలుగులో ఓ యంగ్ హీరో పక్కన అమైరాకి ఛాన్స్ దక్కిందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ యంగ్ హీరో మరెవరో కాదు, అక్కినేని అఖిల్ అనీ తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఆ సినిమాలో కైరా అద్వానీని ఓ హీరోయిన్‌గా ఎంచుకునే యోచనలో ఉన్నారు. ఇంకో హీరోయిన్‌గా అమైరా పేరు పరిశీలనలోకొచ్చిందట. క్యూట్ అండ్ హాట్ అప్పీల్‌లో అమైరా టాప్. మరి ఈ సినిమాలో ఏ అప్పీల్ కోసం అమైరాని ఎంచుకోవాలనుకుంటున్నారో కానీ, తొలి సినిమా అచ్చి రాలేదు. మలి సినిమా 'రాజుగాడు' కూడా ఆకట్టుకోలేకపోయింది. ఒకవేళ అన్నీ కుదిరితే, తెలుగులో అమైరాకి ఇది మూడో సినిమా అవుతుంది. ఈ మూడో సినిమా అయినా అమైరాకి కలిసొస్తుందేమో చూడాలిక.