జీవితా రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తై శివాత్మిక 'దొరసాని'గా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. రౌడీ స్టార్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. మొన్న ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసి, సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా టీజర్ విడుదల చేశారు. అదో పల్లెటూరు. రాజు అనే కుర్రోడు.. పెద్దింటి చిన్నది దొరసానమ్మని ప్రేమిస్తాడు. ఆమె కూడా రాజు ప్రేమని అంగీకరిస్తుంది. దొరసానితో పేదోడి ప్రేమ ఎలా ఉంటుంది.. చాలా సినిమాల్లో చూసేశాం. హీరో ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి.
మరి ఏం చేశారీ ప్రేమ జంట.? ఊరు కట్టుబాట్లను ఎదుర్కొని ఎలా తమ ప్రేమను బతికించుకున్నారు.? తెలియాలంటే 'దొరసాని' చూడాల్సిందే. కానీ అప్పుడే కంగారు పడితే సరిపోదు. ఇంకా ఈ సినిమా డేట్ కన్ఫామ్ కాలేదు. టీజర్ అయితే ప్రామిసింగ్‌గా ఉంది. తొలి సినిమానే అయినా, హీరో, హీరోయిన్లు ఇద్దరూ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా చూపించారు. కథ పాతదే అయినా ఫీల్ కొత్తగా ఉండేలా కనిపిస్తోంది. తెలంగాణా యాసలో సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. 90ల కాలం నాటి స్టోరీని యూత్‌కి కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ కె.వి.ఆర్.మహేంద్ర ఎలా చూపించాడో.. శాంపిల్‌గా టీజర్‌తో చెప్పేశాడు. చూడాలి మరి, యూత్‌ని ఎంత మేర కనెక్ట్ చేస్తుందో ఈ 'దొరసాని'.