‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ ‘ఆనందం ఆరాటం...’ లిరిక‌ల్ విడుద‌ల

మరిన్ని వార్తలు

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబ‌లి’. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు అందిస్తోన్న మ‌రో కంటెంట్ బేస్డ్ మూవీ ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా ‘కేరాఫ్ కంచ‌పాలెం’ ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య‌దేవ్ హీరోగా న‌టించారు.

 

జాతీయ అవార్డు గ్ర‌హీత బిజిబ‌ల్ సంగీతం అందించిన ఈ సినిమాలో ‘ఆనందం ఆరాటం...’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రెహ‌మాన్ రాసిన ఈ పాట‌ను గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్‌, సౌమ్యా రామకృష్ణ‌న్ ఆల‌పించారు. సాంగ్ విజువ‌ల్స్ చూస్తుంటే ప‌క్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన సాంగ్ అని అర్థ‌మ‌వుతుంది.

 

ఈ సందర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ - ‘‘డైరెక్ట‌ర్ వెంక‌ట్ మ‌హా మ‌న నెటివిటీకి త‌గిన‌ట్టు మంచి ఎమోష‌న్స్‌తో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌` సినిమాను అద్భుతంగా మ‌లిచారు. టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇప్పుడు లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘ఆనందం ఆరాటం..’ అనే సాంగ్‌ను విడుద‌ల చేశాం. గుడ్ రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమాకు సంబంధించిన అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS