'పుష్ష‌'పై మ‌రో రూమ‌ర్‌.. ఖండించిన చిత్ర‌బృందం.

మరిన్ని వార్తలు

`పుష్ష‌`పై పుట్టుకొస్తున్న గాసిప్పుల‌కు కొద‌వే లేదు. అంత‌కు ముందు ఈ సినిమాలో రోజా న‌టిస్తోంద‌ని చెప్పుకున్నారు. అదేం లేద‌ని తేలిపోయింది. పాయ‌ల్ రాజ్ పుత్ ఐటెమ్ సాంగ్ చేస్తుంద‌ని అన్నారు. అదీ ఉత్తుత్తిదే అని తెలిసిపోయింది. ఇప్పుడు పుష్ష‌పై మ‌రో గాసిప్ చ‌క్క‌ర్లు కొడుతోంది.

 

ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీల‌క పాత్ర పోషిస్తున్నాడ‌ని, త‌ను బ‌న్నీకి అన్న‌గా న‌టిస్తున్నాడ‌న్న‌ది ఆ వార్త సారాంశం. రంగ‌స్థ‌లంలో ఆది చ‌ర‌ణ్‌కి అన్న‌లా న‌టించాడు. త‌న పాత్ర‌, చ‌ర‌ణ్‌తో ఆది కెమిస్ట్రీ అన్నీ బాగా పండాయి. ఆ సెంటిమెంట్ తో ఆదిని సుకుమార్ రిపీట్ చేస్తున్నాడేమో అని భావించారు. అందుకే ఆది ఎంట్రీ పై ఎవ‌రికీ అనుమానాల్లేవు. కాక‌పోతే ఈ సినిమాలో ఆది న‌టించ‌డం లేద‌ట. త‌న‌కు అలాంటి ఆఫ‌రేం రాలేద‌ని ఆది క్లారిటీగా చెప్పేశాడు. చిత్ర‌బృందం కూడా ఈవార్త‌ల్ని ఖండించింది. ఆది పేరు ప‌రిశీల‌న‌కు రాలేద‌ని, అస‌లు బ‌న్నీకి అన్న క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో లేద‌ని తేల్చేసింది. సో.. ఇది కూడా రూమ‌రే అన్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS